AP: మేం కొత్తగా రాజకీయాల్లోకి రాలేదని, దేని మీద స్పందించాలో.. దేని మీద స్పందించకూడదో తమకు అవగాహన ఉందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ శాసనమండలిలో బుధవారం మెడికల్ కాలేజీలపై చర్చ సందర్భంగా బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారా? అని వైసీపీ నేతలు ప్రశ్నించారు. దానికి రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ సమాధానమిచ్చారు.