జగిత్యాల: స్వామి వివేకానంద 163వ జయంతి పురస్కరించుకొని అభినయ కళానికేతన్ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో సేవా రంగం విభాగంలో వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన వారికి విశిష్టమైన కృషి చేసినందుకు మెమొంటో శాలువాతో ఆదివారం సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి చైర్మన్ ధ్యావ వసంత సురేష్, ఏఎస్ఐ శ్రీనివాస్, చిలుకమారి శ్రీనివాస్, శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవాసమితి, తదితరులు పాల్గొన్నారు.