డేటా వినియోగదారులకు ప్రముఖ టెలికం కంపెనీ జియో సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. రూ.49కే 24 గంటల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తోంది. ఒకరోజు అపరిమిత డేటా కావాలనుకునేవారికి ఈ రీఛార్జ్ ప్లాన్ మంచి ఆప్షన్. ఇందులో కాలింగ్, SMS సౌకర్యం ఉండదు. అలాగే Jio రూ.11కే గంటపాటు అన్‌లిమిటెడ్ డేటా రీఛార్జ్ ప్లాన్‌ను కూడా తీసుకొచ్చింది. ఇప్పటికే జియో నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న Airtel, VI, BSNLలకు ఈ కొత్త ప్లాన్‌లు మరింత సవాలుగా మారనున్నాయి.