బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా వార్డుల వారీగా తయారు చేసిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రదర్శించినట్లు శుక్రవారం పంచాయతీ కార్యదర్శి సాయికుమార్ తెలిపారు. ఈ ఓటర్ల జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 21 వరకు గ్రామపంచాయతీలో లిఖితపూర్వకంగా తెలపాలని ఆయన కోరారు.