స్టీల్ ప్లాంటుకు కేంద్ర ప్యాకేజీ చరిత్రాత్మక నిర్ణయం: సీఎం చంద్రబాబు
విశాఖ స్టీల్ ప్లాంటుకు కేంద్రం ప్రకటించిన రూ11,440 కోట్ల ప్యాకేజీ చరిత్రాత్మక నిర్ణయమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కుమారస్వామికి సీఎం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. "ఇది ఏపీ ప్రజలు గర్వించ దగ్గ విషయం. విశాఖ ఉక్కు అంటే కేవలం పరిశ్రమ మాత్రమే కాదు. ఆంధ్రుల హృదయాల్లో విశాఖ ఉక్కుకు ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర ప్రజలకు ఇకపై అన్నీ మంచి రోజులే. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు" అని చంద్రబాబు పేర్కొన్నారు.