చంద్రబాబు తీరుపై అంబటి రాంబాబు ఆగ్రహం

85చూసినవారు
చంద్రబాబు తీరుపై అంబటి రాంబాబు ఆగ్రహం
AP: పిల్లల్ని కనడంపై సీఎం చంద్రబాబు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం ఎక్స్ వేదికగా.. ‘ఎన్నికల్లో ఎంత మంది ఉన్నా అందరికీ ‘తల్లికి వందనం’ అని మోసం చేశావు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడేమో లెక్కలేకుండా పిల్లల్ని కనమంటున్నావు.. సిగ్గుందా?’. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, నిన్న సీఎం చంద్రబాబు రాష్ట్ర జనాభా పెంచాలంటూ వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్