భారత్ స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో పెళ్లి పెళ్లి పీటలెక్కనున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో తాజాగా ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు. దీంతో వీరికి క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రియా సరోజ్ ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు. మచ్లిషహర్ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రియా సరోజ్ సుప్రీంకోర్టులో న్యాయవాదిగా కూడా పనిచేస్తున్నారు.