విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.11,440 కోట్లు కేటాయించిన కేంద్రం

75చూసినవారు
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.11,440 కోట్లు కేటాయించిన కేంద్రం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రివైవల్ ప్యాకేజీ కింద కేంద్రం రూ.11,440 కోట్లు కేటాయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ప్రకటనలో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్యాకేజీ కేటాయించిన ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్