Top 10 viral news 🔥
నాకు ప్రాణహాని ఉంది: మంచు మనోజ్
HYD: తనపై జరిగిన దాడి ఘటనపై పహాడి షరీఫ్ పీఎస్లో హీరో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులపై మంచు మనోజ్ ఫిర్యాదు చేయలేదని సీఐ గురువారెడ్డి తెలిపారు. ఇంట్లో ఉండగా పది మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడి చేశారని ఆయన ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని.. ఘటనా స్థలంలో కిరణ్, విజయ్ అనే వ్యక్తులు సీసీ ఫుటేజ్ మాయం చేశారని మనోజ్ చెప్పినట్లు సీఐ వివరించారు.