బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ నందు బి. ఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి కడవాత్ భరత్ వాలీబాల్ పోటీలలో తెలంగాణ యూనివర్సిటీ జట్టుకు ఎంపికయ్యాడు. తెలంగాణ యూనివర్సిటీ తరఫున పురుషుల సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ 2024- 25 యూనివర్సిటీ ఆఫ్ కేరళ వారి ఆధ్వర్యంలో జిమ్మీ జార్జ్ ఇండోర్ స్టేడియం తిరువనంతపురంలో పాల్గొన్నాడని కళాశాల స్పోర్ట్స్ ఇంచార్జ్ వై. సంజీవరెడ్డి బుధవారం తెలిపారు.