దావోస్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి బయలుదేరిన సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. గురవారం దావోస్ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరారు. శుక్రవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమై కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరనున్నట్లు సమాచారం.