స్కూల్ సెప్టిక్ ట్యాంకులో పడి చిన్నారి మృతి (వీడియో)
తమిళనాడు విల్లుపురం జిల్లా విక్రవాండిలో శుక్రవారం విషాద ఘటన జరిగింది. సెయింట్ మేరీస్ ప్రైవేట్ స్కూల్లో లియా లక్ష్మి అనే మూడేళ్ల బాలిక ఎల్కేజీ చదువుతోంది. బాలిక రెస్ట్ రూమ్‌కి వెళ్లిన సమయంలో సెప్టిక్ ట్యాంక్‌పై ఇనుప మూతపై కాలు వేసింది. మూత విరిగిపోవడంతో బాలిక సెప్టిక్ ట్యాంకులో పడింది. బాలికను స్కూల్ సిబ్బంది వెలికి తీసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.