ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ వాహనంలోనే చిక్కుకుపోయాడు. అతడిని రక్షించమని చుట్టుపక్కల వారిని వేడుకున్నాడు. అయితే వారు అతడిని రక్షించగా పోగా.. వీడియోలు తీయడం, మరికొందరు డ్రైవర్ మొబైల్, డబ్బు దోచుకోవడం వంటివి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలు ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడానికి బదులు.. వారిని దోచుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు ఈ వీడియో నిరూపిస్తోంది.