సీతాఫలాలు తింటే క్యాన్సర్, గుండె జబ్బులు మటుమాయం
సీతాఫలాలు తింటే ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. సీతాఫలాల్లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌లు పుష్కలంగా ఉన్నాయి. దీనిని తినడం వల్ల గుండె జబ్బులు దరిచేరవు. రక్తహీనత వంటి సమస్యలు మాయమవుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో కెమికల్స్ ఫ్రీ రాడికల్స్ వల్ల క్యాన్సర్ వంటి సమస్యలు దూరమవుతాయి. కళ్ల ఆరోగ్యాన్ని పెంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు.