పోలీసుల కాన్ఫరెన్స్‌లో చోరీకి గురైన బ్రిటన్‌ పోలీసింగ్‌ శాఖ మంత్రి బ్యాగు

80చూసినవారు
పోలీసుల కాన్ఫరెన్స్‌లో చోరీకి గురైన బ్రిటన్‌ పోలీసింగ్‌ శాఖ మంత్రి బ్యాగు
బ్రిటన్‌ పోలీస్‌ శాఖ మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి డేమ్‌ డయనా జాన్సన్‌ పర్సనల్‌ బ్యాగు చోరీకి గురైంది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు ఓ అనుమానితుడిని అరెస్టు చేశారు. పోలీసు ఉన్నతాధికారుల కాన్ఫరెన్సులోనే ఈ ఘటన జరగడం గమనార్హం. రద్దీతో సతమతమవుతున్న జైళ్ల నుంచి కొంతమంది ఖైదీలను విడుదల చేసిన రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. దీంతో అక్కడి పోలీసుల తీరు, భద్రతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్