నిరుపేద రెడ్డి కుటుంబానికి ఆర్థిక సహాయం
జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం శ్రీరాములపల్లె గ్రామానికి నిరుపేద కుటుంబానికి చెందిన నూతుల రాజి రెడ్డి కూతురు జమున అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితం మరణించారు. వెంటనే స్పందించిన గ్రామ యూత్ నాయకుడు రామచందర్ రెడ్డి స్పందించి తక్షణం 5, 000 రూపాయలు అందించి సహాయపడ్డాడు. అలాగే చలించిన మెట్ పెల్లి డివిజన్ రెడ్డి మిత్ర బృందం వారు 1, 30, 850 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. అలాగే రెడ్డి జనతా గ్యారేజ్ మిత్ర బృందం వారు కూడా 40, 000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. మొత్తం 1, 70, 850 రూపాయలను స్థానిక గ్రామస్తుల అధ్వర్యంలో వారి వద్దకు వచ్చి రాజి రెడ్డి కుటుంబానికి అండగా మేమున్నామంటూ వారికి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా వారికి ఇల్లు కట్టించడానికి మేము కృషి చేస్తాం అని హామీ ఇచ్చారు. అలాగే గ్రామ సర్పంచ్ గంగారెడ్డి 5000 రూపాయలు, శ్రీరాములపల్లి సేవా సమితి అధ్యక్షుడు రమేష్ రెడ్డి 2000 , అంకం శ్రీనివాస్ జాబితా పూర్ 2000, ముధ్ధం వినోద్ కుమార్ గౌడ్ 1000, అఖిల్ చారి 700, బోగ తిరుపతి 500 , మొత్తం1, 87, 000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా సహాయం చేసినా ప్రతీ ఒక్కరికీ రాజి రెడ్డి కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు.