125 మొసళ్లను షాకిచ్చి చంపేశాడు (Trending)
థాయ్‌లాండ్‌కు చెందిన మొసళ్ల పెంపకందారు నత్థపక్ ఖుంకడ్ (37) సాహసం చేశారు. ఇటీవలి వరదల కారణంగా మొసళ్లు ఉండే ఎన్‌క్లోజర్ గోడ దెబ్బతింది. గోడకూలి మొసళ్లు బయటకు వస్తే ప్రజల ప్రాణాలకు హాని అని భావించారు. దీంతో అక్కడి అధికారులకు సమాచారమిచ్చి వారి సలహా మేరకు 125 మొసళ్లకు షాకిచ్చి చంపేశాడు. దీంతో జనాల కోసం తన లాభాన్ని వదులుకున్న ఖుంకడ్పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.