ప్రకాశం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు
AP: ప్రకాశం జిల్లాలో శనివారం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో పలు చోట్లా భూమి కంపించింది. దాదాపు 2 సెకన్ల పాటు భూమి కంపించినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల, ఇళ్ల నుంచి ప్రజలు, అధికారులు విద్యార్థులు బయటకు పరుగులు తీశారు.