AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో రాకాసి అలలు బీభత్సం సృష్టించాయి. సుమారు 30 ఇళ్లు కూలిపోయాయి. ఉప్పాడ సూరాడపేటలో కెరటాల ఉధృతికి అంగన్వాడీ భవనం కుప్పకూలింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.