TG: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలో భారీగా డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. కిలో ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.కోటి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పటాన్‌చెరు పోలీసులు తెలిపారు. పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.