జగిత్యాల పట్టణంలోని గాయత్రి మొబైల్స్ లో సోమవారం అర్ధరాత్రి దొంగలు వెంటిలేషన్ నుండి చొరబడి నాలుగు కొత్త మొబైల్స్ , 10 పాత మొబైల్స్, 15000 నగలు దోచుకున్నారు. పాత బస్టాండ్ సమీపంలో ఉన్న మొబైల్ పాయింట్ ఎంచుకున్న దొంగలు వెంటిలేషన్ ద్వారా మొబైల్ షాప్ లోకి వచ్చే దాదాపు రెండు లక్షల విలువగల ఫోన్ లను, నగదును దొంగిలించారు. పోలీసులు, క్లూస్ టీంతో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరుపుకున్నారు.