
జగిత్యాల: అర్ధరాత్రి సమయంలో నిఘా మరింత పటిష్టం
అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా బ్లూ కోల్డ్స్, పెట్రోకార్ వాహనాలతో నిరంతర గస్తీ నిర్వహిస్తూ అదనంగా నైట్ బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో జిల్లా ఎస్పీ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల మెట్పల్లి ప్రాంతాల్లో పెట్రోలింగ్ వ్యవస్థను స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు.