TG: జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు
HYD: నార్సింగి జంట హత్యల కేసును గురువారం పోలీసులు ఛేదించారు. నిందితుడిని మధ్యప్రదేశ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి PS పరిధిలోని పుప్పాలగూడలో బిందు అనే యువతి, అంకిత్ అనే యువకుడిని కత్తులతో పొడిచి, బండరాయితో మోది చంపిన విషయం తెలిసిందే. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకొని జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు.. వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్లు గుర్తించారు.