AP: గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. అమరావతిలోని సచివాలయంలో గురువారం సీఎం మీడియాతో మాట్లాడుతూ.."గత ప్రభుత్వం వల్ల స్థానికులు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు భయపడ్డారు. రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలు పారిపోయేలా చేశారు. అభివృద్ధి వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చు. సంపద సృష్టిస్తాం.. పేదలకు పంచుతాం’’ అని తెలిపారు.