కేంద్ర కేబినెట్ గురువారం కీలక నిర్ణయాలు తీసుకుంది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ లో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రూ.3,985 కోట్ల వ్యయంతో మూడో లాంచ్ ప్యాడ్‌ను నిర్మించనున్నారు. NGLV ప్రయోగాలకు అనుగుణంగా మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. NGLV ద్వారా భారీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది.