ఏపీపై బీజేపీ స్పెషల్ ఫోకస్!
ఏపీపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు బీజేపీ కేంద్ర నాయకత్వం కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలోనేే గతంలో కంటే భిన్నంగా మోదీ ప్రభుత్వం ఏపీ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమిలో ఉంటూనే రాష్ట్రంలో సొంతంగా ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పార్టీ పరంగా ప్రక్షాళన చేయడానికి సిద్ధమైంది. కాగా, ఇటీవలి కాలంలో కేంద్రం నుంచి ఏపీకి వరుసగా సాయం అందుతోంది. ఈ నిర్ణయాలే ప్రజల్లో బీజేపీకి సానుకూలత పెరుగుతున్నట్లు తెలుస్తోంది.