AP: ఏ విపత్తు వచ్చినా ఎన్డీఆర్ఎఫ్ మొదట గుర్తొస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జపాన్, నేపాల్, తుర్కియేలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సేవలు అందించిందని ఆయన గుర్తు చేశారు. విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. దేశంలో సమస్యల పరిష్కారానికి అమిత్ షా పట్టుదలతో కృషి చేస్తున్నారన్నారు. కేంద్రం సహకారంతో వెంటిలేటర్ నుంచి ఏపీ బయటపడిందన్నారు.