పాపం.. రాక్‌ను ఎలా మార్చేశారో చూడండి

80చూసినవారు
పాపులర్ నటుడు, రెజ్లర్ డ్వేన్ డగ్లస్ జాన్సన్ అలియాస్ 'ది రాక్'ను ఆయన కూతుళ్లు జోకర్‌గా మార్చేశారు. తాను జిమ్‌కు వెళ్లే ముందు తన కూతుళ్లు జాజీ, టియా ఎలా మార్చారో చూడాలంటూ ఓ వీడియోను ట్విట్టర్ ‘ఎక్స్’లో ఆయన పంచుకున్నారు. వారు తనకు లిప్స్‌టిక్, ఐ లైనర్‌తో పాటు ముఖమంతా రంగు పూశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్