30 రోజుల్లోగా మూసీ జీవనోపాధి కమిటీ కార్యాచరణ రూపకల్పన
మూసీ జీవనోపాధి కమిటీలో దాన కిషోర్ మెంబర్ కన్వీనర్‌గా ఉన్నారు. మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖతోపాటు పాఠశాల విద్య కమిషనర్, తెలంగాణ గురుకుల పాఠశాలల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కమిటీలోని సభ్యులు తమ తమ శాఖలకు సంబంధించిన కార్యాచరణను రూపొందించి 30 రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.