ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీతో భేటీ కానున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని పోరాట కమిటీ డిప్యూటీ సీఎంను కోరనుంది. ప్రైవేటీకరణను వ్యతిరేకించడం సహా ఆర్థికంగా స్టీల్ ప్లాంట్ నిలదొక్కుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కార్మిక సంఘాలు కోరనున్నాయి. కాగా, సోమవారం ఢిల్లీలో స్టీల్, ఆర్థిక శాఖల కీలక సమావేశం జరగనుంది.