Oct 28, 2024, 17:10 IST/రామగుండం
రామగుండం
ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: మంత్రి
Oct 28, 2024, 17:10 IST
సింగరేణి సంస్థ, రామగుండం-3 ఏరియా ఆధ్వర్యంలో జీఎం కార్యాలయ సమీపంలో 9 హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు 3 కోట్ల 56 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఎకో పార్క్ కోసం సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భూమిపూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వం సంస్థ అభివృద్ధితోపాటు ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జీఎంలు సుధాకరరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.