Dec 25, 2024, 10:12 IST/
రేపు CM రేవంత్ రెడ్డిని కలుస్తున్నాం: దిల్ రాజు
Dec 25, 2024, 10:12 IST
సీఎం రేవంత్ రెడ్డిని గురువారం కలుస్తున్నామని TSFDC చైర్మన్, నిర్మాత దిల్ రాజు తెలిపారు. హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా సీఎంను కలిసేందుకు వస్తున్నారని చెప్పారు. TFDC తరఫున రేపు ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ఉండబోతుందని పేర్కొన్నారు. శ్రీతేజ్ గత మూడు రోజులుగా వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నారని.. బాలుడి ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారని తెలిపారు. శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.