హై కోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు
జర్నలిస్ట్ మీద దాడి కేసులో నటుడు మోహన్ బాబు తెలంగాణ హై కోర్టు ఆశ్రయించారు. హత్యాయత్నం కేసు నమోదైన నేపథ్యంలో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కాగా మంచు ఫ్యామిలీలో గొడవ జరిగిన నేపథ్యంలో మోహన్ బాబు జర్నలిస్ట్పైకి మైకి విసిరిన విషయం తెలిసిందే.