నేటి నుంచి శబరిమలలో అయ్యప్ప దర్శనం
మండల పూజ అనంతరం ఈనెల 26న మూసివేసిన శబరిమల ఆలయం ఇవాళ తిరిగి తెరుచుకోనుంది. సాయంత్రం 4 గంటలకు సంప్రదాయ పూజలు నిర్వహించిన తర్వాత స్వామివారి దర్శనం కల్పించనున్నారు. సంక్రాంతి సందర్భంగా ఏటా జనవరి 14న భక్తులు మకర జ్యోతిని దర్శించుకుంటారు. NOV 15న ప్రారంభమైన మండల పూజల్లో DEC 26 వరకు దాదాపు 32 లక్షల మందికి పైగా దర్శించుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం పేర్కొంది.