అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్(100) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన జార్జియాలోని తన స్వగృహంలో కన్నుమూసినట్లు కార్టర్ కుటుంబం తెలిపింది. ఆయన యూఎస్ ప్రెసిడెంట్‌గా 1977-1981 మధ్యకాలంలో పనిచేశారు. అమెరికా అధ్యక్షుల్లో సుదీర్ఘకాలం జీవించిన వ్యక్తిగా కార్టర్ రికార్డ్ సృష్టించారు. కాగా 2002లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. భారత్‌లో 1978లో కార్టర్ పర్యటించారు. ఆయన పర్యటనకు గుర్తుగా హరియాణాలోని ఓ గ్రామానికి కార్టర్‌పురిగా నామకరణం చేశారు.