విషాదం.. ప్రమాదవశాత్తు వ్యక్తి దుర్మరణం
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగులమల్యాల గ్రామానికి చెందిన మ్యాక రవీందర్ (37) పెయింటింగ్ కూలి పని చేస్తూ జీవిస్తున్నాడు. ఓదెల మండలం కొలనూరు గ్రామంలో ఓ ఇంటికి పెయింటింగ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి పోయాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రవీందర్ భార్య స్వాతి ఫిర్యాదు మేరకు పొత్కపల్లి ఎస్సై అశోక్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.