మరణించిన గీత కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించిన గౌడనాయకులు
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామానికి చెందిన బత్తిని సత్తయ్య గౌడ్ గత వారం రోజుల క్రితం వృత్తి ధర్మంలో భాగంగా తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి క్రిందపడి తీవ్ర గాయాలపాలై మరణించారు. బాదిత కుటుంబాన్ని సర్వాయి పాపన్న మోకూదెబ్బ గౌడ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కత్తి ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.