Feb 22, 2025, 15:02 IST/
తండ్రి ఆత్మహత్య చేసుకుంటున్నారని వెక్కి వెక్కి ఏడ్చిన కూతురు
Feb 22, 2025, 15:02 IST
AP: తండ్రి ఆత్మహత్య చేసుకుంటున్నారని నాన్న కోసం కూతురు వెక్కి వెక్కి ఏడ్చిన ఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట చోటుచేసుకుంది. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ.. 70 సెంట్ల భూమిని మ్యూటేషన్ కోసం రైతు దగ్గర వీఆర్వో రూ. 3 లక్షలు లంచం అడిగారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. లంచం ఇవ్వలేనని, తన భూమిని మ్యూటేషన్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.