మల్లాపూర్ మండలం - Mallapur Mandal

కరీంనగర్ జిల్లా
ఢిల్లీలో ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించే వారి వాహనదారుల ఫోటోలు పంపిస్తే భారీగా నగదు బహుమతి
Sep 02, 2024, 14:09 IST/

ఢిల్లీలో ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించే వారి వాహనదారుల ఫోటోలు పంపిస్తే భారీగా నగదు బహుమతి

Sep 02, 2024, 14:09 IST
ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ట్రాఫిక్‌ రూల్స్‌ను అతిక్రమించే వారి వివరాలను అందించిన వారికి రూ.50వేల వరకు రివార్డు ఇస్తామని వెల్లడించారు. దీని కోసం ట్రాఫిక్‌ ప్రహారీ అనే యాప్‌ను తీసుకువచ్చారు. ఈ యాప్‌లో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, వెహికల్ నంబర్‌ సహా పలు వివరాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి వెంటనే సదరు వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.