ఓదెల మండలకేంద్రం నుండి 31మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో కరీంనగర్ లో శనివారం విజయవంతమైనట్లు మాజీ ఎంపీటీసీ బోడకుంట శంకర్ తెలిపారు. ఉచిత రవాణ భోజన వసతులు కల్పించామని, ఉచిత కంటి శస్త్ర చికిత్సలకు సహకరించిన నేత్రవైద్య నిపుణులు పూదరి దత్తాగౌడ్, డా. అనురాగ్ పవార్, లగిశెట్టి వంశీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గీతాంజలి డిగ్రీ కళాశాల కరెస్పాండంట్ రాజేష్ కుమార్ పాల్గొన్నారు.