AP: బాలిక (16)పై సవతి తండ్రి అత్యాచారానికి పాల్పడటంతో.. రెండు వారాల క్రితం ఆ బాలిక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ అమానవీయ ఘటన విజయవాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంత శంకర్ దాస్ అనే సవతి తండ్రి బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ప్రెగ్నెంట్ అవ్వడంతో.. ఆమె తల్లి అనంత శంకర్ దాస్‌ను నిలదీశారు. దాంతో అతను అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఖమ్మంలో ఉన్న బంధువుల ఇంటికి బాలికను పంపించగా.. ఇటీవల ఆడ బిడ్డకు జన్మనివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.