భార్యపై భర్త దుర్మార్గం.. మత్తు మందు ఇచ్చి!

56చూసినవారు
భార్యపై భర్త దుర్మార్గం.. మత్తు మందు ఇచ్చి!
AP: విశాఖలోని సింగరాయ కొండపై నివసిస్తున్న వెంకట రమణ, కృష్ణవేణిలకు ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. మద్యానికి బానిసైన వెంకట రమణ.. భార్య బంగారాన్ని తాకట్టు పెట్టాడు. దాంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. భార్యను చంపాలనుకున్న వెంకట రమణ.. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆమెకు ఇచ్చాడు. స్పృహ కోల్పోయాక ఆమెకు నిప్పంటించాడు. ఆమె అరుపులు విన్న స్థానికులు కృష్ణవేణిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెంకట రమణపై కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్