రెప్పపాటులో రెండు ఘోరాలు.. ఏడుగురు బలి

65చూసినవారు
రెప్పపాటులో రెండు ఘోరాలు.. ఏడుగురు బలి
AP: జాతీయ రహదారులపై శనివారం సంభవించిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు బలయ్యారు. విజయనగరం జిల్లాలో కారు అదుపుతప్పి డివైడర్ దాటి పక్క లేన్‌లోకి బోల్తా కొట్టగా.. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే, కృష్ణా జిల్లా కంకి పాడు వద్ద కూడా ఇదే తరహా ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు చేపల లోడు వ్యాన్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురూ స్పాట్‌లోనే చనిపోయారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్