ఏపీలో రాజ్యసభ అభ్యర్థులపై ఎన్డీఏ క్లారిటీ
ఏపీలో రాజ్యసభ అభ్యర్థుల కేటాయింపుపై ఎన్డీఏ క్లారిటీ ఇచ్చింది. రెండు స్థానాలు టీడీపీకి, ఒకటి బీజేపీకి కేటాయించింది. ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్యను అనూహ్యంగా ఎంపిక చేసింది. వైసీపీ నుంచి వచ్చిన బీద మస్తాన్ రావుకు టీడీపీ మరోసారి అవకాశం ఇచ్చింది. మోపిదేవి రాజీనామా చేసిన స్థానంలో సానా సతీష్‌కు అవకాశం కల్పించింది. నామినేషన్ దాఖలు చేయడానికి ముగ్గురు అభ్యర్థులు విజయవాడకు బయలుదేరారు. రేపటితో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది.