గుజరాత్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. జునాగఢ్ జిల్లా మలియా (హటినా) సమీపంలో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో CNG ట్యాంక్ పేలడంతో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న గుడిసెకు కూడా మంటలు అంటుకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.