పెద్దపల్లి: కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి

63చూసినవారు
పెద్దపల్లి: కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి
మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనాలు చెల్లించాలని పెద్దపల్లిలో బుధవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్- సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ఎదుట నిరసన దీక్ష చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కార్యదర్శి ముత్యంరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సిపెల్లి రవీందర్, మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు చంద్రయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్