ఘోర ప్రమాదం.. నలుగురు పాఠశాల విద్యార్థినుల మృతి (వీడియో)
కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాలక్కడ్ జిల్లా కల్లడికోడ్ సమీపంలోని పానయంపాడు వద్ద అతివేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నలుగురు పాఠశాల విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు. సాయంత్రం 4 గంటల సమయంలో విద్యార్థులు పాఠశాల ముగించుకుని బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. సిమెంటు లోడ్‌తో వచ్చిన లారీ అదుపు తప్పి రోడ్డుపై నుంచి పిల్లలపైకి దూసుకెళ్లింది.