పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక వద్ద నిర్మాణం చేపట్టబోయే రిజర్వాయర్ పై పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సమీక్ష జరిపారు. సోమవారం ఎలిగేడు మండలం శివపల్లిలోని తన నివాసంలో పత్తిపాక రిజర్వాయర్ ప్రాజెక్టుపై నీటి పారుదల శాఖ ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రిజర్వాయర్ నిర్మాణంపై చర్చించారు. రూ. 2950 కోట్లతో పత్తిపాక ప్రాజెక్టు ప్రాథమిక అంచనాలు తయారు చేయడంతో ఆశలు చిగురించాయి.