సైఫ్‌పై దాడి కేసులో నిందితుడికి పోలీస్ కస్టడీ
బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో రెండో నిందితుడైన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను తాజాగా బాంద్రాలోని న్యాయస్థానం ఎదుట పోలీసులు హాజరుపరిచారు. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం 5 రోజులపాటు పోలీసుల కస్టడీకి అనుమతించింది. దీంతో అతడిని బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయంపై నిందితుడి తరఫు న్యాయవాదులు మీడియాతో మాట్లాడారు. పోలీసులు దర్యాప్తు సరిగ్గా చేయలేదని ఆరోపించారు.