పద్మ పురస్కారాలపై సీనియర్ నటుడు నరేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం, నటుడు నందమూరి తారక రామారావుకు భారతరత్న, సీనియర్ నటి, నిర్మాత విజయ నిర్మలకు పద్మ పురస్కారం రావాలని కోరారు. ప్రపంచంలో 46 సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళ విజయనిర్మల అని గుర్తు చేశారు. తన అమ్మకు అవార్డు రావాలని ఢిల్లీ స్థాయిలో ప్రయత్నం చేశానన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో పురస్కారం కోసం సిఫారసు చేశారని తెలిపారు.